Advertisementt

ఎన్టీఆర్‌కు స్టొరీ రెడీ...!

Mon 09th May 2016 09:12 AM
jr ntr,vakkantam vamsi,janata garage,janata garage after ntr film  ఎన్టీఆర్‌కు స్టొరీ రెడీ...!
ఎన్టీఆర్‌కు స్టొరీ రెడీ...!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌.. కొరటాల శివ దర్శకత్వంలో 'జనతాగ్యారేజ్‌' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రానికి సంబంధించిన భారీ యాక్షన్‌ సీన్స్‌ను కేరళలో చిత్రీకరించనున్నారు. కాగా గతంలో ఎన్టీఆర్‌ నటించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ 'సింహాద్రి'కి చెందిన కొన్ని సీన్స్‌ను కేరళలోనే చిత్రీకరించారు. అదే సెంటిమెంట్‌తో 'జనతాగ్యారేజ్‌' చిత్రంలోని కీలకసన్నివేశాలను కేరళ చిత్రీకరించడానికి నిర్ణయించడాన్ని నందమూరి అభిమానులు ఎంతో సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌.. స్టార్‌ రైటర్‌ వక్కంతం వంశీ డైరెక్షన్‌లో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పక్కా స్క్రిప్ట్‌ కూడా ఓకే అయిందని, దీనికి ఎన్టీఆర్‌ కూడా ఓకే చేయడంతో స్క్రిప్ట్‌ను లాక్‌ చేయడం జరిగిందని తాజా సమాచారం. మరి కొత్త దర్శకునికి అవకాశం ఇస్తున్న ఎన్టీఆర్‌కు ఈ చిత్రం ఎంత పెద్ద హిట్‌ను అందిస్తుందో వేచిచూడాల్సివుంది. తనపై ఉంచిన నమ్మకాన్ని వక్కంతం ఎంతవరకు నిలబెట్టుకుంటాడో కూడా చూడాలి..! ఈ చిత్రం నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బేనర్‌లో రూపొందనుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ