వైకాపా నేత జగన్ రెండు కళ్ళ సిద్దాంతాన్ని పాటిస్తున్నారు. ఒకే తరహా సంఘటనపై రెండు విధాలుగా స్పందిస్తున్నారు. వైకాపా ఎమ్మెల్యేలు ఆంధ్రలో తెదేపాలోకి జంప్ అవుతే చంద్రబాబు కొనేశారని, తెలంగాణలో జరిగితే మాత్రం ప్రలోభాలు అంటు సుతిమెత్తని మాటని వాడుతున్నారు. ఆంధ్రలో అయితే వైకాపా నేతలకు కోట్ల రూపాయలు ఇచ్చారని, కాంట్రాక్టులు కట్టబెట్టారని అంటారు. అదే తెలంగాణలో అయితే అసలు స్పందనే ఉండదు.
వైకాపా తెలంగాణ శాఖ మొత్తం తెరాసలో చేరింది. నిజానికి దీనిపై వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయాలి. కేసీఆర్ పై ఆరోపణలు చేయాలి. గవర్నర్ కు , స్పీకర్ కు ఫిర్యాదు చేయాలి. కానీ అలాంటివేమి జరగలేదు. ఎందుకంటే జగన్ కేసీఆర్ తో దోస్తీ చేయడానికే మొగ్గుచూపుతున్నారు. జగన్ ఆస్థులు, సొంత నివాసం హైదరాబాద్ లోనే ఉంది. సాక్షి పత్రిక, ఛానల్ ఉన్నాయి. అంతేకాదు కోర్డులో కేసులున్నాయి కాబట్టి న్యాయపరంగా సహకారం కావాలంటే కేసీఆర్ కావాలి అందుకే దోస్తీ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారని ఆరోపిస్తూ ధర్నా చేయబోతున్న జగన్ వాటిని కడుతున్న కేసీఆర్ ను ఒక్క మాట అనలేదు కానీ చంద్రబాబును మాత్రం దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ వైఖరీ కేసీఆర్ కు అనుకూలంగా కనిపిస్తుంది.