Advertisementt

గ్రాఫిక్స్ కోసం 100 కోట్లా..?

Sun 08th May 2016 04:42 PM
robo2,shankar,rajanikanth,akshay kumar,graphics work  గ్రాఫిక్స్ కోసం 100 కోట్లా..?
గ్రాఫిక్స్ కోసం 100 కోట్లా..?
Advertisement
Ads by CJ

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రం 'రోబో 2'. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో గ్రాఫిక్స్ చాలా ఎక్కువ శాతం ఉన్నట్లు సమాచారం. దీనికోసం సుమారుగా 100 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. కేవలం గ్రాఫిక్స్ కోసం ఏడు కంపెనీలు పని చేస్తున్నాయట. ఈ ఏడు కంపనీలు చేసే పనిని ఒక కంపనీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుందట. ఇప్పటికే గ్రాఫిక్స్ పనులు మొదలయ్యాయని కోలీవుడ్ మీడియా ద్వారా తెలుస్తోంది. నిర్మాతలు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించడం విశేషం. రోబో సినిమాలో ఉన్న గ్రాఫిక్స్ కు మించి ఇప్పటివరకు సౌత్ లో ఎవరు చూడని విధంగా ఈ సినిమాలో గ్రాఫిక్స్ ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. శంకర్ రూపొందించిన 'ఐ' సినిమా ఘోర పరాజయం పొందడంతో ఈ సినిమాను ఎంతో కసిగా తెరకెక్కిస్తున్నాడు. ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయడానికి అన్ని డిపార్ట్మెంట్స్ వారు సమిష్టి కృషి చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ