'సర్దార్‌గబ్బర్‌సింగ్' చిత్రం పవన్‌నే కాదు.. ఆయన వీరాభిమానులకు కూడా తీవ్ర అసంతృప్తి మిగిల్చింది. దాంతో సామాన్యంగా సినిమాకు సినిమాకు మధ్య పెద్ద గ్యాప్ తీసుకునే పవన్ కేవలం తన 'సర్దార్' విడుదలైన మూడు వారాలకే ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ఓ ఫ్యాక్షన్ అండ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఓ ప్రేమకథాచిత్రమని పవన్ ఆల్‌రెడీ చెప్పేశాడు. కాగా కొందరు మాత్రం తమిళంలో అజిత్ హీరోగా 2014 సంక్రాంతి విడుదలైన 'వీరం' చిత్రం మూలం తీసుకొని మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్పులు చేర్పులు చేశారని అంటున్నారు. ఈ చిత్రంలో షూటింగ్ సమయంలో పవన్ గెటప్ కూడా 'వీరం'లోని అజిత్ గెటప్‌లాగానే ఉందనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా 'వీరం'ను అసలు పూర్తిగా మార్చివేసి మూలంలోని పాయింట్‌ని మాత్రం తీసుకొని కథని సరికొత్తగా ఆకుల శివ రాశాడని అంటున్నారు. తమిళంలో శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తెలుగులో ఎస్.జె.సూర్య దర్శకత్వం వహిస్తున్నాడని, కానీ 'వీరం' చిత్రం ఇప్పటికే తెలుగులో 'వీరుడొక్కడే' పేరుతో డబ్బింగ్ చేశారని, కాబట్టి ఇవ్వన్నీ ఊహాజనితమైన వార్తలు గా కొందరు కొట్టిపారేస్తున్నారు. అయితే గతంలో ఇలా తెలుగులోకి డబ్ అయిన కొన్ని చిత్రాలు ఆ తర్వాత మరలా రీమేక్ అయ్యాయని ఆధారాలు చూపిస్తున్నారు మరికొందరు. మొత్తానికి పవన్ 'అత్తారింటికి దారేది' చిత్రం తర్వాత నటించిన 'గోపాల గోపాల' యావరేజ్‌కాగా, 'సర్దార్' డిజాస్టర్‌గా నిలిచింది. మరి ఈ సమయంలో తన అభిమానులకు, ప్రేక్షకులకు భారీగా బాకీ పడి ఉన్నాడు పవన్. మరీ ఈ బాకీని సూర్య చిత్రంతోనైనా తీరుస్తాడో లేదో చూడాల్సివుంది. కాగా ఈ చిత్రానికి ప్రస్తుతం 'హుషార్', 'సేనాపతి' అనే టైటిల్స్ వినపడుతున్నాయి.