ప్రస్తుతం ఉన్న సమాజంలో అక్రమసంబంధాలు, ఎఫైర్స్ సాధారణంగా మారిపోయాయి. పెళ్లై.. పిల్లలు ఉన్నా వారికి ఇష్టమైన మరో వ్యక్తితో సహజీవనం చేయడం కామన్ అయిపోయింది. సాధారణ ప్రజలైతే.. ఈ విషయాలు అంతగా పట్టించుకోము కానీ ఇలాంటి రిలేషన్స్ మన సెలబ్రిటీలు మెయిన్టైన్ చేస్తున్నారంటే.. మాత్రం ఆ విషయం హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఇండస్ట్రీలో ఎవరికీ తెలియకుండా చాలా మంది హీరో, హీరోయిన్లు సీక్రెట్ గా ఎఫైర్ నడిపిస్తుంటారు. ఆ విషయాలు బయటకు వస్తే గనుక మాకు ఈ వార్తలతో ఎలాంటి సంబంధం లేదని సింపుల్ గా స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. అసలు విషయంలోకి వస్తే.. ప్రస్తుతం ఓ సీనియర్ స్టార్ హీరోతో ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకుంటున్న ఓ అందాల ముద్దుగుమ్మ డేటింగ్ చేస్తోందట. ఆ హీరో తనకొక ఇల్లును కూడా ప్రెజంట్ చేశాడట. వారిద్దరూ కలిసి ఆ ఇంట్లోనే సమయం గడుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ అందాల భామ తలుచుకుంటే తన వయసున్న ఏ హీరోతో అయినా.. సన్నిహితంగా మెలగొచ్చు. కాని అలా కాకుండా ఈ సీనియర్ హీరో వెంటపడడానికి మరో కారణం ఉందట. ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు లైఫ్ స్పాన్ తక్కువ. అలా కాకుండా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండాలంటే ఖచ్చితంగా ఎవరైనా సపోర్ట్ చేయాలి. అందుకే ఈ భామ ఈ హీరోతో సన్నిహితంగా మెలుగుతోందని సమాచారం. ఆ హీరో నటించబోయే తదుపరి సినిమాలో ఈ ముద్దుగుమ్మ కే అవకాశం ఇవ్వాలని నిర్మాతలకు సూచించాడట.