తమిళంలో సూపర్ హిట్ అయిన 'తని ఒరువన్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. 'ధృవ' అనేది వర్కింగ్ టైటిల్. ఈ సినిమాలో రామ్ చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించబోతున్నాడు. దీనికోసం చెర్రీ కఠినమైన ట్రైనింగ్ తీసుకుంటున్నాడని సమాచారం. రోజులో చాలా గంటలు గుర్రపు స్వారీ, సైక్లింగ్ కోసమే కేటాయిస్తున్నాడట. ఈ పాత్ర కోసం చరణ్ బరువు కూడా తగ్గాల్సి ఉందట. కాబట్టి బరువు తగ్గడానికి స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలను చరణ్ స్పోక్ పెర్సన్ స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది కానీ కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. మే 16 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. కాశ్మీర్ ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన మరోసారి రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుంది.