కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, విక్రం కె కుమార్ ల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం '24'. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ బాషలలో ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది. మంచి ఎటంప్ట్ చేసారంటూ.. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ రెస్పాన్స్ విన్న హీరో నితిన్ తన ట్విట్టర్ ద్వారా టీం అందరికి శుభాకాంక్షలు తెలిపారు. మాస్టర్ పీస్ లాంటి సినిమాతో శ్రేష్ట్ మూవీస్ అసోసియేట్ అయినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. అంటే శ్రేష్ట్ మూవీస్ సంస్థ '24' సినిమాతో అసోసియేట్ అయ్యారనే విషయాన్ని నితిన్ కన్ఫర్మ్ చేశాడు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను తెలుగులో శ్రేష్ట్ మూవీస్ వారే రిలీజ్ చేస్తున్నారని ప్రకటించారు. అయితే మే 6న సినిమా రిలీజ్ చేయాలని భావించిన 24 టీం ఆ విషయాన్ని సుధాకర్ రెడ్డి కి చెప్పారు. అదే రోజున తన కొడుకు నటిస్తోన్న 'అ ఆ' సినిమా రిలీజ్ చేస్తారని ఊహించిన సుధాకర్ రెడ్డి ఆరోజైతే కుదరదని చెప్పేసాడు. మే 6న ఎట్టిపరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేయాలని సూర్య భావించాడు. దీంతో వీరి డీల్ క్యాన్సిల్ అయిందనే వార్తలు వచ్చాయి. కాని ఈరోజు నితిన్ చేసిన ట్వీట్స్ తో ఈ వార్తల్లో నిజం లేదనే విషయం తేలింది..!