రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఆయన అభిమానులకు పండుగే. సినిమా రిలీజ్ రోజు రజనీ అభిమానులు చేసే హడావిడే వేరు. కాని ఈ మధ్యకాలంలో రజనీకాంత్ చేస్తోన్న సినిమాలు పరాజయం పొందుతున్నాయి. గత రెండు చిత్రాలు విక్రమసింహ(కొచ్చడయాన్),లింగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. లింగా సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కు రజనీ కొంత డబ్బు ఇచ్చి సెటిల్ చేశాడు. విక్రమసింహ సినిమాకు నష్టపోయిన.. రెండు తెలుగు రాష్ట్రాల పంపిణీదారులకు ఏడు కోట్ల డబ్బును రీఫండ్ ఇస్తామని చిత్ర నిర్మాతలు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ఆ డబ్బు వారికి చేరలేదు. దీంతో రజనీకాంత్ నటిస్తోన్న 'కబాలి' సినిమా తెలుగు రైట్స్ ఎవరు తీసుకోకుండా డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ అడ్డుపడుతున్నారు. ఫిలిం ఛాంబర్ లో పిర్యాదు కూడా చేశారు. తమకు రావాల్సిన మొత్తాన్ని ఇస్తేనే తప్ప సినిమా రిలీజ్ చేయడానికి ఒప్పుకోమని వారి వాదన. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో.. చూడాలి..!