Advertisementt

చిరు 150కి 150 రావాల్సిందే: బన్నీ

Thu 05th May 2016 05:35 PM
allu arjun,sarainodu,chiranjeevi,150th film  చిరు 150కి 150 రావాల్సిందే: బన్నీ
చిరు 150కి 150 రావాల్సిందే: బన్నీ
Advertisement
Ads by CJ

చిరంజీవి 150వ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే మెగాస్టార్ కూడా సినిమాకు కసరత్తులు మొదలుపెట్టాడు. ఈ మధ్యనే సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకొంది. ఈ కార్యక్రమానికి ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప మిగిలిన మెగా కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. అల్లు అర్జున్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే నిన్న విజయవాడలో జరిగిన 'సరైనోడు' సక్సెస్ సెలబ్రేషన్స్ లో చిరు 150వ సినిమా గురించి బన్నీ స్వయంగా మెగాస్టార్ తో మాట్లాడిన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. చిరంజీవి చెయ్యి పట్టుకొని బన్నీ ఒక మాట చెప్పాడట. ఇంతకీ ఏం చెప్పాడో అసలు విషయంలోకి వస్తే.. ''మరోసారి ఫాంలోకి వచ్చారు కాబట్టి.. ఖచ్చితంగా 150కి 150 కోట్లు షేర్ సాధించాల్సిదే.. అని చెప్పాడట'' దానికి మనందరం కలిసి హెల్ప్ చేయాలంటూ.. బన్నీ ప్రేక్షకులకు పిలుపునిచ్చాడు. మరి బన్నీ ఆశించినట్లుగా చిరు సినిమా 150 కోట్ల షేర్ సాధిస్తుందో.. లేదో.. చూడాలి..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ