జగన్ మీడియా ఆంధ్రవైపా లేక తెలంగాణ వైపా... ఇది మీడియా రంగంలో ఆసక్తికలిగిస్తోంది. జగన్ కు రోజు భజన చేసే సాక్షి పేపర్, ఛానల్ ఇప్పుడు సందిగ్దంలో ఉంది. ఎందుకంటే తమ యజమాని జగన్ జై ఆంధ్ర అనేశారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయం స్పష్టమైంది. పైగా తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ధర్నా కూడా చేయబోతున్నారు. జగన్ ఆంధ్రకు అనుకూలం కాబట్టి తెలంగాణ వైకాపా దుకాణం మూతపడింది. ఇప్పుడు జగన్ మీడియా ఎటువైపు ఉంటుంది. ప్రతి రోజు జగన్ కు జోలపాట పాడడం సాక్షికి అలవాటు. ఆ ప్రకారం జగన్ ధర్నాకు మద్దతు గా రాయాలి, ప్రసారం చేయాలి. అదే చేస్తే తెలంగాణలో సాక్షి మీడియాపై వ్యతిరేకత వస్తుంది. తెలంగాణను వ్యతిరేకిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నెర్ర చేస్తారు. ఈ విషయంలో ఏబిఎన్, టీవీ 9 ఛానల్స్ కు ఎదురైన అనుభవం గుర్తుకువస్తుంది. ఇలాంటి క్రిష్ట పరిస్థితిలో మీడియా విలువలు కాపాడుకుంటూ తెలంగాణలో జై తెలంగాణ, ఆంధ్రలో జై ఆంధ్ర నినాదంతో అంటే రెండు కళ్ళ సిద్దాంతంతో జగన్ మీడియా ముందుకు వెళుతుందని మీడియా సర్కిల్స్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.