Advertisementt

ఫైర్‌బ్రాండ్‌ సమాధానాలు అదుర్స్‌!

Wed 04th May 2016 04:43 PM
revanth reddy,kcr,telangana tdp leader,chandrababu naidu,trs,kcr family  ఫైర్‌బ్రాండ్‌ సమాధానాలు అదుర్స్‌!
ఫైర్‌బ్రాండ్‌ సమాధానాలు అదుర్స్‌!
Advertisement

ఓటుకు నోటు ఒక్క విషయాన్ని పట్టుకొని అందరూ అదే పనిగా రేవంత్‌రెడ్డిని విమర్శిస్తున్నారు. కానీ ఆయన ఫైర్‌బ్రాండ్‌ అని, ప్రజాబలం ఉన్న మంచి డైనమిక్‌ లీడర్‌ అని అందరూ ఒప్పుకోవాల్సిందే. కేసీఆర్‌ని చూసి అందరూ భయపడుతున్న వేళ ఆయన్ను పబ్లిగ్గా టార్గెట్‌ చేయగలిగిన ఒకే ఒక్క నాయకుడు రేవంత్‌రెడ్డి. కాగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో 15మంది టిడిపి ఎమ్మేల్యేలు గెలిస్తే అందులోని  12 మంది ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక మిగిలింది ముగ్గురు ఎమ్మేల్యేలు మాత్రమే. ఇలాంటి సమయంలో రేవంత్‌రెడ్డి టిడిపికి అండగా తన పోరాటం సాగిస్తున్నాడు. వాస్తవానికి వాక్చాతుర్యంతో ప్రత్యర్దులను ఇరుకునపెట్టడంలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు వంటి వారు ఉద్దండులు, తమకు ఎదురు తిరిగిన వారిని ఏదో విధంగా భయపెట్టడం వారి నైజం. అయితే ఈ ముగ్గురి విమర్శలకు ఒకే ఒక్క రేవంత్‌రెడ్డి గట్టిగా సమాధానాలు ఇస్తూ ఇప్పటికీ అధికార టీఆర్‌ఎస్‌ను తన మాటలతో ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ టిడిపి రాజకీయాలను ఆయన ఒంటి చేత్తో మోస్తున్నాడు. కాగా పాలేరు ఉప ఎన్నికల్లో టిడిపి పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంపై టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. నారాయణ్‌ ఖేడ్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన టిడిపి ఇప్పుడు పాలేరు విషయంలో మానవతావిలువలు, రాజకీయ విలువలు అని మాట్లాడుతోందని టిఆర్‌ఎస్‌ విమర్శిస్తోంది. 

దీనికి సమాధానంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... నారాయణ్‌ఖేడ్‌ ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తమను సంప్రదించలేదని, అందుకే పోటీ చేశామని, కానీ పాలేరు విషయంలో ముందుగానే కాంగ్రెస్‌ తమను సంప్రదించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ధీటుగా సమాధానం చెప్పాడు రేవంత్‌రెడ్డి. ఇక కాంగ్రెస్‌ తరపున కనీసం పాలేరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న సుచరితరెడ్డికి అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీలో చేర్చుకుని మంత్రులను చేస్తున్న కేసీఆర్‌ తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిందని, ఆమెకు కూడా అలాగే ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించాడు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాసొమ్మును దుర్వినియోగం చేస్తోందని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేసిన సందర్భంగా టిసర్కార్‌ అన్ని ప్రముఖ పత్రికలకు యాడ్స్‌ ఇచ్చింది. దాదాపు అన్ని పత్రికలు మొదటి పేజీల్లో ఈ యాడ్‌ను ప్రచురించాయి. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్ట్‌ భూమి పూజ చేస్తే అంతంత పెద్ద పెద్ద ఫొటోలతో ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏమెచ్చింది అంటూ మండిపడ్డాడు. మీరేమైనా అందాల పోటీల్లో ఐశ్వర్యారాయ్‌తో పోటీ పడటానికి వెళ్తున్నారా? పెద్ద పెద్ద ఫోటోలతో మామా అల్లుళ్లు ప్రచారం చేసుకోవడానికి అని ఎద్దేవా చేశారు. అందునా ఈ ప్రకటనల కాంట్రాక్ట్‌ను ఓ ఆంధ్రా ఏజెన్సీకి ఇవ్వడాన్ని తప్పుబట్టి టిఆర్‌ఎస్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాడు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement