అ ఆ ఆడియో వేడుకలో పవన్ కల్యాణ్ హుషారుగా, చలాకిగా కనిపించారు. సినీరంగంలో జయాపజయాలు సహజమే కాబట్టి సర్దార్... ఫ్లాప్ నుండి ఆయన త్వరగానే తేలుకున్నారని అనుకోవచ్చు. అంతేకాదు ఎస్.జె.సూర్య డైరెక్షన్ లో కొత్త సినిమాకు కూడా శ్రీకారం చుట్టారు. తన మిత్రుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అ ఆ వేడుకలో సరదాగా మాట్లాడారు. అందరికీ బెస్టాఫ్ లక్ చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది. పవన్ అంటే బయటివారికే కాదు ఇంట్లోని వారికి (రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్) కూడా ఇష్టమే. ఇటీవలే వీరి సినిమాలు వరుసగా మొదలయ్యాయి. కుటుంబ వేడుకలా వీటి ప్రారంభోత్సవం జరిగింది. ఓపనింగ్ కు రాకపోతే పోయాడు కనీసం వారికి అభినందనలు సైతం చెప్పలేదు పవన్.
ఇక మెగా కుటుంబానికి మూల పురుషుడు చిరంజీవి 150 వ సినిమా సైతం మొదలైంది. ఇది కూడా కుటుంబవేడుకలా జరిగింది. అన్నయ్య మీద గౌరవం ఉందని తరచుగా చెప్పే పవన్ సినిమా ప్రారంభోత్సవానికి రానప్పటికీ, కనీసం తన ట్విట్టర్ ద్వారా కూడా అన్నయ్యకు శుభాకాంక్షలు అని ట్వీట్ చేయలేకపోయారు. ఇది అభిమానులను బాధించే విషయమే. కుటుంబం లేకుండా తాను లేననే విషయాన్ని పవన్ గుర్తిస్తే మంచిది.