Advertisementt

మహేష్‌ సరసన దీపికానా?

Wed 04th May 2016 01:45 PM
mahesh babu,murugadoss,deepika padukone,mahesh with deepika padukone  మహేష్‌ సరసన దీపికానా?
మహేష్‌ సరసన దీపికానా?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు 'బ్రహ్మోత్సవం' చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ నెలలోనే విడుదలకు సిద్దమవుతోంది. కాగా ఈ చిత్రం తర్వాత మహేష్‌ తమిళ దర్శకుడు మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం మురుగదాస్‌ బాలీవుడ్‌లో సోనాక్షిసిన్హా ప్రధానపాత్రలో 'అకీరా' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కానుంది. కాగా మురుగదాస్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో మహేష్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు? అనే విషయంపై పలు ప్రచారాలు జరుగుతున్నాయి. 'నేను.. శైలజ' ఫేమ్‌ కీర్తిసురేష్‌ బాలీవుడ్‌ భామ పరిణితిచోప్రాల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా దీపికా పడుకొనేను ఒప్పించారని తెలుస్తోంది. ఈ భామ దక్షిణాధికే చెందినది అయినప్పటికీ ఈమెకు బాలీవుడ్‌లో యమా క్రేజ్‌ ఉంది. ఆమె బాలీవుడ్‌లోని స్టార్స్‌ అందరితో కలిసి నటించింది. దక్షిణాది విషయానికి వస్తే ఆమె రజనీకాంత్‌ సరసన 'కొచ్చాడయాన్‌' చిత్రంలో నటించింది. మొత్తానికి ఆమె మహేష్‌ పక్కన నటించే అవకాశం పొందితే మాత్రం ఆమె టాలీవుడ్‌ స్టార్‌తో కలిసి నటిస్తున్న తొలిచిత్రం మహేష్‌దే అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ