మొదటిరోజు డివైడ్ టాక్ వచ్చినా మరే పెద్ద సినిమా పోటీలో లేనందున 'సరైనోడు' మాత్రమే ప్రేక్షకులకు బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. దాంతో ఈ చిత్రం మరలా పుంజుకొని ఎవ్వరూ ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తోంది. ప్రస్తుతం బన్నీ 'సరైనోడు' సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే హీరో బన్నీపై దర్శకుడు బోయపాటి శ్రీను అలిగినట్లు సమాచారం. సినిమా సక్సెస్‌లో తనకు సరైన గుర్తింపు లభించడం లేదని ఆయన ఫీలవుతున్నాడు. ఒక సినిమా ఫ్లాప్ అయితే అందరూ దర్శకుడిదే తప్పు అంటారు. అదే సినిమా హిట్టయితే అందరూ హీరోనే ఆకాశానికి ఎత్తేస్తారని ఆయన బాధ. సినిమా సక్సెస్‌లో హీరోకి ఎంత భాగముంటుందో అంతే భాగం దర్శకునికి కూడా ఉంటుంది కదా..! అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. 'సరైనోడు' సక్సెస్‌కి ఇంతగా కారణమైన తనని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని బోయపాటి బాధ. అల్లుఅర్జున్ కూడా దర్శకుడిగా తనపేరు ఎక్కడా ప్రస్తావించడం లేదని, ఇది తనను బాధించిందని ఆయన తన సన్నిహితులతో చెప్పుకొని బాధపడుతున్నాడు. తాను బాలయ్యతో 'లెజెండ్' వంటి సూపర్‌హిట్ సినిమా తీసినప్పుడు బాలకృష్ణ ఆ సినిమా ప్రమోషన్‌లో తనకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చిన విషయాన్ని బోయపాటి ఏకంగా అల్లుఅరవింద్‌కు గుర్తుచేశాడట. ఈ విషయం బన్నీ దగ్గరకు కూడా చేరడంతో బోయపాటి ఇబ్బందిని అర్థం చేసుకున్న బన్నీ త్వరలో నిర్వహించబోతున్న 'సరైనోడు' సక్సెస్ టూర్‌లో బోయపాటికి సరైన ప్రాధాన్యం ఇస్తానని మాట ఇచ్చాడంటున్నారు. అలాగే వచ్చే ఏడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే మరో సినిమా చేస్తానని మరోసారి ఆయన బోయపాటికి మాట ఇచ్చాడని సమాచారం.