పవన్ కళ్యాణ్, దాసరి నారాయణరావులు కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. అయితే రెండు, మూడు సినిమాల తరువాత పవన్ సినిమాలకు దూరమవుతానని చెప్పడంతో ఖచ్చితంగా పవన్, దాసరితో సినిమా చేయడం కష్టమని చాలా మంది భావించారు. ఈ విషయాన్ని పవన్ ని అడిగినప్పుడల్లా.. మంచి కథ ఉంటే చేస్తామని చెప్పాడు కానీ పెద్దగా రియాక్ట్ కాలేదు. అయితే దాసరి మాత్రం ఖచ్చితంగా పవన్ తో సినిమా చేస్తున్నాని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా మొదలు పెడుతున్నాం. కథ సిద్ధంగా ఉంది. త్రివిక్రమ్ కూడా పని చేస్తున్నాడు. అయితే డైరెక్టర్ ఎవరనే విషయాన్ని సస్పెన్స్ గా పెట్టాం. అది కాకుండా మరో మూడు ప్రాజెక్ట్స్ పట్టాలెక్కించాలనుకుంటున్నాం. అందులో అందరు కొత్త వాళ్ళతో నేనొక సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాను. పూర్తి స్థాయి ప్రేమ కథగా ఆ చిత్రం ఉంటుంది. మిగిలిన రెండు సినిమాలకు ఎవరైన డైరెక్టర్స్ కావొచ్చు. ఇంకా డిసైడ్ కాలేదని'' అన్నారు.