దర్శకరత్న దాసరి నారాయణరావు 2019 ఎన్నికల్లో రాజకీయాల్లో పోటీ చేయనున్నారనే వార్తలు హల్ చల్ చేశాయి. దీనికోసం జగన్ ప్రత్యేకంగా దాసరిని కలిసారని కూడా కొన్ని వార్తలు ప్రచురింపబడ్డాయి. వీటిపై రీసెంట్ గా దాసరి స్పందించారు. ''నేను 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ చేరుతాననే వార్తలు వస్తున్నాయి. అందులో నిజంలేదు. ప్రస్తుతం రాజకీయ ఆలోచనలు లేవు. నేను రాజకీయాల్లోకి వెళ్లకపోవడానికి కారణం కూడా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులే. కొందరు రాజకీయాలను వ్యాపార వ్యవస్థగా మార్చుకుంటున్నారు. నాలా సూటిగా ఉండేవారు రాజకీయాలకు పనికి రారు. వెళ్ళినా.. బురద చల్లించుకొని రావాలి. నాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో మంచి సాన్నిహిత్యం ఉంది. 1978 నుండే ఆయన నాకు తెలుసు. ఆయనకు నాకు ఉన్న స్నేహంతోనే జగన్ నాతో మాట్లాడానికి వచ్చాడు. నిత్యం జనాల్లో ఉండే మనిషి జగన్. ఏదో సాధించాలనే తత్వం గలవాడు. నా సపోర్ట్ ఎప్పటికి తనకు ఉంటుంది'' అని చెప్పారు.