దర్శకుడు మణిరత్నం తన సినిమాలను ఎంత శ్రద్ధగా, జాగ్రత్త తీసుకొని చేస్తాడో.. అందరికీ తెలిసిందే. ప్రతి ఫ్రేము కొత్తగా ఉండాలని పరితపించే లెజండరీ డైరెక్టర్ ఆయన. అటువంటి దర్శకుడితో పని చేసే ఛాన్స్ కొట్టేశాడు హీరో కార్తి. మణిరత్నం చేయబోయే తదుపరి సినిమాలో కార్తి పైలట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర చాలా న్యాచురల్ గా ఉండాలని, కార్తి పైలట్ క్రాష్ కోర్స్ నేర్చుకుంటున్నాడు. పైలట్ గా తన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి..? ఎలా కూర్చోవాలి..? అనే వాటిపై కార్తి ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ కోర్సు ఓ మూడు వారల పాటు ఉంటుందని సమాచారం. ఇది పూర్తయిన వెంటనే కార్తి షూటింగ్ లో పాల్గొననున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసి ఈ ఏడాదిలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పైలట్ గా కార్తి ఎంత వరకు మెప్పిస్తాడో.. చూడాలి..!