'ప్రేమ కథా చిత్రం','కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ','భలే మంచి రోజు' వంటి భిన్నమైన చిత్రాల్లో నటిస్తూ.. తనకంటూ.. ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు హీరో సుధీర్ బాబు. హీరోగా నటిస్తున్న తనకు 'బాఘీ' సినిమా ద్వారా బాలీవుడ్ లో విలన్ గా నటించే అవకాసం వచ్చింది. ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేనప్పటికీ.. సుధీర్ బాబు క్యారెక్టర్ కు మాత్రం మంచి పేరొచ్చింది. యాక్షన్ సీన్స్ లో చాలా బాగా నటించాడని బాలీవుడ్ మీడియా ప్రచురిస్తోంది. అయితే సుధీర్ బాబు యాక్షన్ నచ్చిన ఓ బాలీవుడ్ ఫిలిం మేకర్ తనకు మరో బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినట్లు సమాచారం. అయితే సోలో హీరోగా మాత్రం కాదు. సుధీర్ తో పాటు మరో బాలీవుడ్ స్టార్ హీరో కూడా ఈ సినిమా నటిస్తున్నాడు. కామెడీకు పెద్ద పీట వేస్తూ ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై అధికార ప్రకటన రానుంది..!