తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఎవరంటే.. తడుముకోకుండా అనుష్క పేరు ఇట్టే చెప్పేస్తారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనుకునే దర్శకులకు అనుష్క తప్ప మరో ఛాయిస్ లేదనడంలో అతిసయోక్తి లేదు. అయితే 'మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని' అనుష్కకు పలు ఇంటర్వ్యూలలో తరచూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రీసెంట్ గా ఈ ప్రశ్నలపై అనుష్క స్పందించింది. తనకు నిజాయితీగా ఉండే మగాళ్లంటే ఇష్టమని చెప్పింది. సన్ గ్లాసస్ పెట్టుకునే అబ్బాయిలతో మాట్లాడాలంటే నాకు అసలు నచ్చదని కూడా చెప్పింది. ఎదుటి వ్యక్తి కళ్ళలో నిజాయితీ కనిపించాలి. కళ్ళను బట్టి వ్యక్తిత్వాన్ని గమనించవచ్చని.. సింపుల్ గా ఉండేవాళ్ళను ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. నా స్నేహితులు, సన్నిహితులు ఇలా నా చుట్టూ అలాంటి వారే ఉంటారని సెలవిచ్చింది. ఇక పెళ్లి విషయానికొస్తే.. దేనికైనా సమయం రావాలని.. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. ప్రస్తుతం అనుష్క 'బాహుబలి','సింగం3' చిత్రాల్లో నటిస్తోంది. ఇది కాకుండా మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా కమిట్ అయినట్లు తెలుస్తోంది.