Advertisementt

అసిస్టెంట్ డైరెక్టర్ గా మోక్షజ్ఞ..?

Mon 02nd May 2016 07:00 PM
balakrishna,gowthami puthra sathakarni,mokshagna,krish  అసిస్టెంట్ డైరెక్టర్ గా మోక్షజ్ఞ..?
అసిస్టెంట్ డైరెక్టర్ గా మోక్షజ్ఞ..?
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాలో నటిస్తున్నాడు. బాలయ్య 100వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బాలకృష్ణ సైతం ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ దర్శకుడు క్రిష్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి మోక్షజ్ఞను 2017లో గ్రాండ్ గా తెలుగు తెరకు పరిచయం చేయాలనేది బాలయ్య ఆలోచన. ఈలోగా సినిమాపై కొంత ఆసక్తి, దర్శకుడి ప్రతిభను వారి కష్టాలను అర్ధం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో బాలకృష్ణ కూడా తన తండ్రి ఎన్టీఆర్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నట్లు ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరిగిపోయింది. క్రిష్ షూటింగ్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ