అక్కినేని నాగార్జున మంచి జోరుమీదున్నాడు. వరుసగా మూడు హిట్స్ సాధించి తన బ్యాచ్ హీరోల్లో ముందున్నాడు. పైగా ఊపిరి ద్వారా తమిళంలో మరోసారి తన సత్తా చాటారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ నాగ్ పుత్రోత్సాహాన్ని కోరుకుంటున్నాడు . తన వారసులు (నాగచైతన్య, అఖిల్) లను కూడా ఫామ్ లోకి తీసుకురావడం ఎలా అనే విషయంపై తర్జనబర్జన పడుతున్నాడు . దీనికోసం తనతో హిట్ సినిమాలు తీసిన దర్శకుల డేట్స్ బ్లాక్ చేసేస్తున్నాడు . తనకి హిట్ ఇచ్చినట్టే తన వారసులకు హిట్ సినిమా తీసిపెట్టమంటూ ఆ దర్శకులను రిక్వెస్ట్ చేస్తున్నాడు. నాగార్జున వంటి పెద్దాయన అడిగితే దర్శకులు కాదనలేరు. పైగా షూటింగ్ మధ్యలోనే దర్శకుల పనితీరు గమనించి కమిట్ చేయిస్తున్నాడు. ఇప్పటికే సోగ్గాడే చిన్నినాయన వంటి హిట్ సినిమా ఇచ్చిన కల్యాణకృష్ణ డేట్స్ నాగార్జున బ్లాక్ చేశాడు . తాజాగా ఊపిరి డైరెక్టర్ వంశీ పైడిపల్లి డేట్స్ ను కూడా నాగార్జున రిజర్వ్ చేసేశాడు . వంశీతో అఖిల్ సినిమా చేయించాలని నాగ్ ఉద్దేశమట. హిట్ సినిమాలు తీసిన కల్యాణకృష్ణ, వంశీ పైడిపల్లిలకు బయట మంచి డిమాండ్ ఉంది. టాప్ స్టార్స్ వీరితో సినిమాలు చేయడానికి సిద్దంగా ఉన్నారు. అయినప్పటికీ ఫ్లాప్ హీరోలు (నాగచైతన్య, అఖిల్)తో సినిమాలు చేయాల్సిన పరిస్థితి వీరికి ఎదురైంది.