హీరోగా తెలుగు తెరకు పరిచయమయినప్పటికీ ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయాడు నందమూరి తారకరత్న. అయితే ఒక్కసారిగా 'అమరావతి' సినిమాలో విలన్ గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దీంతో రీసెంట్ గా నారా రోహిత్ నటించిన 'రాజా చెయ్యి వేస్తే' సినిమాలో కూడా తారక రత్నకు ప్రతి నాయకుడి పాత్రలో నటించే అవకాశం లభించింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. తారకరత్న పెర్ఫార్మన్స్ కు మాత్రం మంచి పేరొచ్చింది. దీంతో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించే సినిమాలో తారక్ ను విలన్ గా నటించమని సంప్రదించారట. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తారక్ కూడా నటించడానికి పాజిటివ్ గానే స్పందిస్తున్నట్లు టాక్. 'రాజా చెయ్యి వేస్తే' సినిమాలో తారక్ పెర్ఫార్మన్స్ చూసిన సాయి ధరమ్ తేజ్ తన సినిమాకు కావాలనే తారక్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం.