Advertisementt

మరో నటి రహస్య వివాహం!

Sun 01st May 2016 04:33 PM
poonam bajwa,marriage,poonam bajwa secret marriage,director sunil reddy  మరో నటి రహస్య వివాహం!
మరో నటి రహస్య వివాహం!
Advertisement
Ads by CJ

హీరోయిన్‌ పూనమ్‌ బజ్వా తెలుగు చిత్రాల్లో కనిపించి చాలా కాలమే అయింది. నాగార్జున నటించిన బాస్‌, అల్లుఅర్జున్‌ నటించిన పరుగు చిత్రంలో ఆమె నటించింది. ప్రస్తుతం ఆమె తమిళ, మలయాళ భాషల్లో నాలుగు సినిమాల్లో నటిస్తోంది. కాగా ఆమె వివాహం ఇటీవలే రహస్యంగా జరిగిందని సమాచారం. తెలుగు దర్శకుడు సునీల్‌రెడ్డిని ఆమె పెళ్లాడింది. కళ్యాణ్‌రామ్‌ నటించి నిర్మించిన ఓం3డి చిత్రానికి ఆయనే దర్శకుడు. ప్రస్తుతం ఆయన సాయిధరమ్‌తేజ్‌తో తిక్క అనే చిత్రం ప్రీపొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. వీరిద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారట. తమ వివాహాన్ని వారు సింపుల్‌గా, సీక్రెట్‌గా, రిజిష్టర్‌ ఆఫీసులో చేసుకున్నారని సమాచారం. మరీ అంత రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వారి వివాహానికి ఎవరైనా అడ్డుపడ్డారా? మరేదైనా కారణంతోనే వారు ఈ వివాహాన్ని వైభవంగా జరుపుకోలేదా? అనే సందేహాలు వస్తున్నాయి. మొత్తానికి మరో సినీ ప్రేమజంట వివాహం చేసుకుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ