మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీని అందరూ స్వాగతించారు. ఆయన మళ్లీ నటించాలని అందరూ కోరుకున్నారు. అందరిదీ పాజిటివ్ ఓపీనియనే. కానీ చిరంజీవి తన కొత్త చిత్ర ప్రారంభత్సవాన్ని ఘనంగా చేసుకోకుండా, కేవలం కుటుంబసభ్యుల నడుమే జరుపుకోవడం ఎందుకు. పైగా రామ్ చరణ్ నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నమిది. చిరంజీవి సినిమా ఆకస్మికంగా అనుకున్నది కాదు. ముందునుండి ప్లానింగ్ ఉంది. అయినప్పటికీ హడావుడి లేకుండా సైలెంట్ గా చేశారు. సొంత సినిమా కాబట్టి ఇలా చేశారు. బయటి నిర్మాత అయితే సందడి ఉండేదని అభిమానులు సైతం భావిస్తున్నారు.
బాలకృష్ణ తన వందవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఓపనింగ్ ఎంత హడావుడి చేశారో అందరికీ తెలిసిందే. సహ నటులను ఆహ్వానించారు. అభిమానులను పిలిచారు. దాంతో పోలిస్తే చిరంజీవి సినిమా సైలెంట్ గానే జరిగింది. చిరంజీవి కొత్త చిత్రం లాంఛనంగా ప్రారంభించిది. కాబట్టి కేవలం కుటుంబసభ్యులనే పిలిచారని, మరోసారి ఘనంగా ఓపనింగ్ చేసి అందరినీ ఆహ్వానిస్తారని యూనిట్ వర్గాలు అంటున్నాయి.