మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ రాజకీయాల్లోనే ఉన్నాడు. కాగా ఆయన వినాయక్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై తమిళ కత్తి రీమేక్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా చిరు ఇమేజ్‌కు తగ్గట్లుగా ఈ చిత్రం ఒరిజినల్ కథలో పలు మార్పులు, చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రంలో చిరు హీరో కాబట్టి ఆయనకు తగ్గట్టుగా ఇందులో చిరు రాజకీయ భవిష్యత్తుకు తగ్గట్లు కనీసం కొంతభాగమైనా రాజకీయ సన్నివేశాలు, డైలాగులు ఉంటాయని అందరూ భావిస్తూ వచ్చారు. కానీ ఈ చిత్రంలో ఎలాంటి పొలిటికల్ సీన్స్ గానీ, డైలాగులు కానీ ఉండవని వినాయక్ స్పష్టం చేశాడు. అయితే ఠాగూర్ చిత్రంలోలాగా ఈ సినిమాలో మంచి సందేశం మాత్రం ఉంటుందని ఆయన తెలిపాడు, సాధారణ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే విధంగా ఈ చిత్రం పక్కా కమర్షియల్ చిత్రంగా, మంచి పాటలు, ఫైట్స్‌తో అందరినీ అలరించేలా ఉంటుందని వినాయక్ చెబుతున్నాడు. సో.. చిరు నుండి ఓ ఫక్తు మాస్ చిత్రం రానుందని స్పష్టమైపోతోంది.