Advertisementt

పవన్‌ మళ్లీ మొదలుపెట్టాడట....!

Sat 30th Apr 2016 01:24 PM
power star pawan kalyan,s.j surya,involvement,new story  పవన్‌ మళ్లీ మొదలుపెట్టాడట....!
పవన్‌ మళ్లీ మొదలుపెట్టాడట....!
Advertisement
Ads by CJ

సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ విషయంలో దర్శకుడు బాబిని పక్కనపెట్టి ప్రతి విషయం పవన్‌కళ్యాణే చూసుకున్నాడనే విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం డిజాస్టర్‌ కావడంతో తన రాబోయే చిత్రాలలోనైనా ఆయన ఇక వేలుపెట్టడని అందరూ ఆశించారు. కానీ తాజాగా ఆయన నటిస్తున్న ఎస్‌.జె.సూర్య చిత్రం విషయంలో ఆకుల శివ అందించిన స్టోరీని, ఎస్‌.జె.సూర్య తయారుచేసుకున్న స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయాలని పవన్‌ ఆదేశించాడట. ఈ చిత్రం ప్రారంభమై రెండు రోజులు కూడా కాలేదు. అప్పుడే పవన్‌ తన ఇష్టానుసారం మార్పులు చేర్పులు చేస్తున్నాడని తెలుస్తోంది. ఫ్లాప్‌లో ఉన్న దర్శకుడు ఎస్‌.జె.సూర్యకు దర్శకత్వం బాధ్యతలు ఇచ్చింది కేవలం తాను చెప్పినట్లు నడుకోవాలనే ఉద్దేశ్యంతోనే అని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసి తలలు బాదుకోవడం పవన్‌ ఫ్యాన్స్‌ వంతయింది. మరి ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్‌ను అందిస్తుందో వేచిచూడాల్సివుంది. కాగా గోపాల గోపాల చిత్రం ఆడియో ఫంక్షన్‌లో ఆయన సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్‌కు మరో అవకాశం ఇస్తానని మాట ఇచ్చాడు. ఆ మాటను మాత్రం పవన్‌ నిలబెట్టుకొని ఈ చిత్రానికి సంగీత బాధ్యతలను అనూప్‌కే అందించడం హర్షణీయం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ