ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో జనతాగ్యారేజ్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఎన్టీఆర్ బర్త్‌డే మే20న జరగనుంది. కిందటి ఏడాది తన బర్త్‌డే కానుకగా తన కుమారుడు అభయ్‌రామ్ ఫొటోలను విడుదల చేసి ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తిన ఎన్టీఆర్ ఈ సారి తన బర్త్‌డే కానుకగా జనతాగ్యారేజ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నాడు. ఇక ఆయన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి కూడా మే 28న కావడంతో ఆ వేడుకను కూడా భారీగా సెలబ్రేట్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. కాగా తన తాత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ తన జనతాగ్యారేజ్ ఫస్ట్ టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మొత్తానికి ఓ వారం గ్యాప్‌లో ఎన్టీఆర్ తన అభిమానులకు, తాత ఎన్టీఆర్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడన్నమాట...!