Advertisementt

మహేష్ సినిమాలో నో యాక్షన్ సీన్స్..?

Fri 29th Apr 2016 03:19 PM
mahesh babu,srikanth addala,brahmothsawam  మహేష్ సినిమాలో నో యాక్షన్ సీన్స్..?
మహేష్ సినిమాలో నో యాక్షన్ సీన్స్..?
Advertisement
Ads by CJ

మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. మే 7న సినిమా ఆడియోను రిలీజ్ చేసి, మే 20న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమాపై ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు మహేష్ బాబు నటించిన ప్రతి సినిమాలోను యాక్షన్స్ సీన్స్ ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన 'శ్రీమంతుడు' సినిమాలో కూడా యాక్షన్ సీన్స్ ఓ రేంజిలో ఉంటాయి. అయితే బ్రహ్మోత్సవంలో మాత్రం ఒక్క యాక్షన్ సీన్ కూడా ఉండదట. మహేష్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా చాలా కొత్తగా ఉండబోతోందని సమాచారం. మాస్ ప్రేక్షకులకు సినిమాలో ఫైట్స్, ఐటెం సాంగ్స్ తప్పనిసరిగా ఉండాలి. మరి అవేమీ లేకుండా ఉన్న ఈ బ్రహ్మోత్సవం సినిమాను మాస్ ప్రేక్షకులు ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారనే విషయం హాట్ టాపిక్ గా మారింది..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ