Advertisementt

చివరికి పూరి చేతుల్లో..!

Fri 29th Apr 2016 01:22 PM
puri jagannath,janaganamana,mahesh babu  చివరికి పూరి చేతుల్లో..!
చివరికి పూరి చేతుల్లో..!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి, బిజినెస్‌మేన్‌ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టాయి. ఈ రెండు చిత్రాల తరువాత హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో పూరి, మహేష్ బాబు తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'జనగణమన' అనే టైటిల్ ను కూడా ఖరారు చేశాడు. గత కొంత కాలం నుండి ఇండస్ట్రీలో జనగణమన అనే టైటిల్ వినిపిస్తూనే ఉంది. ముందుగా పవన్ కళ్యాణ్ కోసం ఈ టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కాని పవన్ ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడు. ఆ తరువాత కృష్ణవంశీ ఈ టైటిల్ తో సినిమా చేస్తున్నాడని.. అలానే దిల్ రాజు కూడా ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించాడని పలు వార్తలు వచ్చాయి. చార్మి కూడా ఈ టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ సినిమా ప్రారంభిస్తుందని మరో వార్త హల్ చల్ చేసింది. అయితే ఈ వార్తల్లో ఏ ఒక్కదానిపై క్లారిటీ లేదు. అయితే ఫైనల్ గా ఈ టైటిల్ పూరి జగన్నాథ్ చేతుల్లోకి వెళ్ళింది. మరి పూరి ఈ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో.. చూడాలి..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ