ప్రస్తుతం మన హీరోలు తాము ఆల్‌రెడీ పనిచేసిన దర్శకులతో సినిమాలు చేయడానికి ఉత్సాహపడుతున్నారు. పవన్‌కళ్యాణ్‌తో ఇప్పటికే ఖుషి, పులి చిత్రాలు చేసిన ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి పవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఆల్‌రెడీ తనతో ఠాగూర్ చిత్రం చేసిన
వి.వి.వినాయక్‌తో తన 150వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్‌బాబు విషయానికి వస్తే ఇప్పటికే శ్రీకాంత్ అడ్డాలతో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం చేసిన మహేష్ తాజాగా అదే డైరెక్టర్‌తో బ్రహ్మూెత్సవం చేస్తున్నాడు. ఇక హీరో గోపీచంద్ కూడా ఇదే దారిలో ఉన్నాడు. తనకు లక్ష్యం, లౌఖ్యం వంటి సూపర్‌హిట్స్ ఇచ్చిన శ్రీవాస్ దర్శకత్వంలో మూడోసారి పనిచేయనున్నాడు. యంగ్‌హీరో రామ్ కూడా తనకు కందిరీగ వంటి హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్‌తో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి మన హీరోలు చేసిన దర్శకులతోనే మరలా మరలా చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపుతుండటం విశేషం.