Advertisementt

బాహుబలి లో యంగ్ టైగర్!

Fri 29th Apr 2016 11:10 AM
jr ntr,rajamouli,bahubali,anushka,ntr guest role  బాహుబలి లో యంగ్ టైగర్!
బాహుబలి లో యంగ్ టైగర్!
Advertisement
Ads by CJ

బాహుబలి- దిబిగినింగ్‌ లో దేవసేనగా నటించిన అనుష్క ఈ పార్ట్‌లో డీ గ్లామర్‌ రోల్‌లో కనిపించింది. శివుడు ప్రభాస్‌కు తల్లిగా, భళ్లాలదేవ చేతిలో చెరపట్టబడిన మహారాణిగా ఆమె కనిపింది. కానీ బాహుబలి- ది కంక్లూజన్‌ లో మాత్రం ఆమె కత్తి పట్టి రాజసం చూపించడంతోపాటు అంతకు మించిన సోయగాన్ని ప్రదర్శిస్తూ... గ్లామర్‌ పాత్రలో బాహుబలికి భార్యగా, మహారాణిగా కనిపించనుంది. కాగా ఇప్పుడు బాహుబలి సెకండ్‌ పార్ట్‌పై టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.  ఈ చిత్రంలో జక్కన్న ఆప్తమిత్రుడు, యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ఓ గెస్ట్‌రోల్‌లో కనిపించనున్నాడనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది హీరోలు ఈ చిత్రంలో నటించనున్నారని వార్తలు వచ్చినప్పటికీ రాజమౌళి వాటిని ఖండించాడు. కానీ ఎన్టీఆర్‌ నటించే విషయం మాత్రం ఖచ్చితమని, ఇందులో ఎన్టీఆర్‌ ఓ కీలకపాత్రలో కనిపిస్తాడని విశ్వసనీయవర్గాల సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ