టాలీవుడ్‌ని విడిచి మళ్లీ బాలివుడ్ కి వెళ్లినా కూడా దర్శకుడు రాంగోపాల్‌వర్మ కెలుకుడు మాత్రం ఆపలేదు. ఆయన పవన్‌ను, ఆయన ఫ్యాన్స్‌ను టార్గెట్ చేసుకొని ట్వీట్స్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా పవన్‌కళ్యాణ్ కంటే అల్లుఅర్జున్ పెద్ద స్టార్ అని, దానికి సర్దార్, సరైనోడు చిత్రాల కలెక్షన్లే ఉదాహరణ అంటున్నాడు వర్మ. పవన్ కంటే బన్నీ పెద్దస్టార్. పవన్ నటించిన సర్దార్ తో పోలిస్తే బన్నీ చేసిన సరైనోడు చిత్రానికే మంచి టాక్, కలెక్షన్లు వస్తున్నాయి. దాంతో తాను పవన్ కంటే బన్నీయే టాప్‌స్టార్ అనే నిర్ణయానికి వచ్చానంటూ మెగాఫ్యామిలీలోనే పవన్‌కు, బన్నీకి మధ్య అగ్గిరాజేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ తిక్క దర్శకుడు బాలీవుడ్‌కి వెళ్లిపోయినప్పుడు ఇక టాలీవుడ్ విషయమై ట్వీట్స్ చేయను అని చెప్పాడు. కానీ తీరా చూస్తే ఆయన మాట తప్పి మరోసారి పవన్ అభిమానులను రెచ్చగొడుతూ ట్వీట్స్ చేస్తున్నాడు. కానీ ఒక హీరో టాప్ స్టార్ అవునా? కాదా? అన్నది ఒక్క సినిమాతో తేల్చేయలేమని వర్మ గుర్తిస్తాడో లేదో చూడాలి.