Advertisementt

అఖిల్ సినిమాకి పేరు కుదిరిందా?

Thu 28th Apr 2016 09:29 PM
akhil,director vamsi paidipally,vamsi akhil combination,new story  అఖిల్ సినిమాకి పేరు కుదిరిందా?
అఖిల్ సినిమాకి పేరు కుదిరిందా?
Advertisement
Ads by CJ

అఖిల్ రెండో సినిమాకి సంబంధించిన బాధ్య‌త‌ల్ని వంశీ పైడిప‌ల్లికే అప్ప‌గించార‌న్న విష‌యం తెలిసిందే. ఊపిరి విడుద‌ల కాక‌ముందు నుంచే ఆయ‌న అఖిల్ సినిమాకోసం క‌థ గురించి అన్వేషిస్తూ వ‌చ్చాడు. హిందీలో విజ‌య‌వంత‌మైన యే జవానీ హై దివానీ రీమేక్ తెర‌పైకొచ్చినా వంశీ ఆ క‌థ‌పై సుముఖ‌త చూప‌లేద‌ట‌. అఖిల్‌తో ఓ కొత్త క‌థ‌ని తెర‌కెక్కించాల‌ని ఆయ‌న డిసైడ‌య్యాడ‌ట‌.  కొంత‌కాలంగా ఆ క‌థ గురించే ఆయ‌న క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.  విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు ఇటీవ‌లే  క‌థ‌, క‌థ‌నాలు ప‌క్కాగా సిద్ధ‌మైపోయాయ‌ట‌.  సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్ర‌స్తుతం రంగం సిద్ధం చేస్తున్న‌ట్టు స‌మాచారం. తాజాగా అందుతున్న స‌మాచారం మేర‌కు  సినిమాకి పేరు కూడా పెట్టేశార‌ని తెలిసింది. లైలా ఓ లైలా అనే పేరుని ఫిక్స్ చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోందట‌. నాగచైత‌న్య ఒక లైలా కోసం పేరుతో సినిమా చేశాడు. ఇప్పుడు అఖిల్ సినిమా  లైలా ఓ లైలా అనే పేరుతో తెరకెక్క‌బోతోంద‌న్న‌మాట‌. అఖిల్ కూడా లైలా జపం చేస్తున్నాడంటే ఆ సినిమా కూడా  ప్రేమ‌క‌థ‌తోనే తెర‌కెక్క‌బోతోంద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌, విల‌నూ ఎవ‌ర‌న్న విష‌యాలు మాత్రం ఇంకా బ‌య‌టికి రాలేదు. ఊపిరితో స‌త్తా చాటాడు  వంశీ పైడిప‌ల్లి. ఆ సినిమాని తీర్చిదిద్దిన విధానం విమ‌ర్శ‌కులతో పాటు, ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు కూడా పొందింది. అందుకే నాగ్ ఆయ‌న చేతిలో త‌న త‌న‌యుడి కీల‌క‌మైన సినిమాని పెట్టాడు. మ‌రి నాగ్ పెట్టుకొన్న న‌మ్మ‌కాన్ని వంశీ మ‌రోసారి నిజం చేస్తాడో లేదో చూడాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ