Advertisementt

ఫ్లాప్ జంట మరోసారి తెరపైకి!

Thu 28th Apr 2016 07:00 PM
ram,thamanna,santhosh sreenivas,kandireega  ఫ్లాప్ జంట మరోసారి తెరపైకి!
ఫ్లాప్ జంట మరోసారి తెరపైకి!
Advertisement
Ads by CJ

ఎనర్జిటిక్ స్టార్ రామ్ రీసెంట్ గా 'నేను శైలజ' సినిమాతో హిట్ కొట్టాడు. తనకు కందిరీగ లాంటి సినిమాను అందించిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో తన తదుపరి సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో రామ్ కు జతగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుంది. రామ్ ఇదివరకు తమన్నాతో కలిసి 'ఎందుకంటే ప్రేమంటే' అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరిగ్గా రాణించలేకపోయింది. కాని సంతోష్, రామ్ హిట్ కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తమన్నా ప్రస్తుతం అభినేత్రి సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఆ సినిమాతో పాటే రామ్ సినిమా కూడా పూర్తి చేయాలని భావిస్తోంది. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరిపి దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ