Advertisementt

దావూద్‌ విషయంలో ఏది నిజం!

Thu 28th Apr 2016 05:11 PM
davud ibrahim,mafia don davud ibrahim,about davud ibrahim health,chota shakeel,davud ibrahim news  దావూద్‌ విషయంలో ఏది నిజం!
దావూద్‌ విషయంలో ఏది నిజం!
Advertisement
Ads by CJ

ముంబై పేలుళ్ల సూత్రధారి, చీకటిరాజ్య అధినేత, భారత్‌ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌, మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంటర్‌పోల్‌ సైతం ఆయనపై రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన విదేశాలకు వెళ్లకుండా కరాచీలోనే చికిత్స పొందుతున్నాడని, ఐఎస్‌ఐ కనుసన్నలలోనే ఆయనకు ట్రీట్‌మెంట్‌ జరుగుతోందని సమాచారం. ఆయన ప్రస్తుతం గ్యాంగ్రీన్‌ వ్యాధితో (శరీరభాగాలు కుళ్లడం)బాధపడుతున్నాడని సమాచారం. అధిక రక్తపోటు, మధుమేహం వల్ల ఆయన కాళ్లకు రక్తప్రసరణ సరిగా లేదని, సరిగా ఆక్సిజన్‌ అందకపోవడంతో ఆయన కాళ్లు పూర్తిగా కుళ్లిపోయాయని, ఇక ఈవ్యాధి వల్ల విడుదలయ్యే విష పదార్ధాల వల్ల ఆయన శరీరం రోజు రోజుకూ కుళ్లిపోతోందని జాతీయ మీడియా అంటోంది. కానీ దావూదు సహచరుడైన చోటాషకీల్‌ మాత్రం తమ గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ భాయ్‌ ఆరోగ్యంగానే ఉన్నాడని, ఇప్పటికే డి కంపెనీ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటున్నాడని చెబుతున్నాడు. ఎంతో ఆరోగ్యం ఉన్న దావూద్‌పై కేవలం కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ వదంతును ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడుతున్నాడు. మొత్తానికి ఈ నీచుడు, క్రూరుడు, ప్రజల ప్రాణాలతో ఆటాడుకునే దావూద్‌కు మాత్రం కుక్క చావు తప్పదని ఆయన వ్యతిరేకులు అంటున్నారు. మరి వీటిల్లో ఏది నిజమో కొంతకాలం ఆగితే కానీ స్పష్టం తెలిసే అవకాశం లేదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ