జగన్ మనస్తత్వం చూసిన వారికి ఆయన నిర్ణయాలు తీసుకునే విధానం నవ్వు తెప్పిస్తుంది. పార్టీ నుండి భూమా, కొణతాల, సుజయ.. ఇలా ఉద్దండులు టిడిపిలోకి వెళ్లిపోతుంటే వారికి ధీటుగా ఆయా నియోజకవర్గాలల్లో పట్టున్న వారిని, టిడిపి అసంతృప్తులను పార్టీలోకి ఆహ్వానించి ఎత్తుకు పైఎత్తు వేయాల్సిన ఆయన ఏ నాయకుడు తమ పార్టీ నుండి వెళ్లిపోయినా తదుపరి సీఎంను తానేనని, తనవైపే ఓటర్లు ఉన్నారనే ఓవర్‌కాన్ఫిడెన్స్‌లో ఆయన ఉన్నాడని, ఆయనకు సరైన నాయకత్వ లక్షణాలు గానీ, ఎవరిని ఎలా వాడుకోవాలో తెలియని మోనార్క్‌గా తనను తాను భావిస్తున్నాడని ఆ పార్టీ నేతలే అంటున్నారు. అయితే కొన్ని విషయాల్లో జగన్ కొంతమందిని మాత్రంనెత్తిన పెట్టుకుంటున్నాడు. పోనీ వారికి ప్రజల్లోగానీ, వారి వారి సామాజికవర్గాల్లో కానీ బలం ఉందా? అంటే లేదనే చెప్పాలి. అలాంటి కాగితపు పులుల మీదనే ఆయన ఎక్కువగా ఊహించుకుంటూ చేరదీస్తున్నారు. కాగా పవన్‌కళ్యాణ్, చిరంజీవిలకు కాపుల్లో ఉన్న క్రేజ్‌ను దెబ్బకొట్టడానికి జగన్ ఎందుకూ పైసాకు కూడా పనికిరాని దాసరినారాయణరావును పార్టీలో చేర్చుకోవాలని తెగ తాపత్రయ పడుతున్నాడు. దాసరి విషయానికి వస్తే ఆయన ఇంట్లో వాళ్లు కూడా ఆయన చెప్పినవారికి ఓటేస్తారా? అన్నది కూడా అనుమానమే. ఇక ఇటీవలే త్వరలో మరలా రాజకీయ అరంగేట్రం చేస్తానని ప్రకటించిన మోహన్‌బాబుది కూడా అదే పరిస్థితి, ఆయన ఓటు ఆయనకే పడదు. అసలు తన తండ్రి రాజకీయాల్లోకి మరలా వెళ్లడం తమకు ఇష్టంలేదని ఆయన కుటుంబసభ్యులు, మరీ ముఖ్యంగా ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు అంటున్నాడు. మోహన్‌బాబు కూడా కేవలం కాగితపు పులే. తానేదో ముక్కుసూటిగా మాట్లాడుతాను అని తనకు తాను గొప్పలు చెప్పుకునే మోహన్‌బాబు ఎన్టీఆర్ పుణ్యమా అని అప్పుడెప్పుడో రాజ్యసభ సీటు వచ్చింది. అది తన గొప్పతనం చూసి ఇచ్చారనేది ఆయన భావన, కేవలం కొందరితో స్నేహం చేస్తూ వారి పేరును చెప్పి పబ్బం గడుపుకోవడం మోహన్‌బాబు నైజం, అవసరమోస్తే కాళ్లు, అవసరం లేకపోతే జుట్టు పట్టుకునే రకం ఆయన. పరిటాల రవి బతికివున్నప్పుడు తన వెనుక పరిటాల ఉన్నాడనే ప్రచారంతో ఆయన చెలరేగిపోయాడు. ఎన్టీఆర్ బతికినంతకాలం ఆయన పేరు చెప్పుకొని బతికిపోయాడు. ఆ తర్వాత లక్ష్మీపార్వతి వంతు, ఆమె నుండి ఆయన పొందిన లబ్ధి కూడా చిన్నదేమీ కాదు. ఇలా కేవలం కాగితపు పులులైన దాసరి, మోహన్‌బాబులను తన పార్టీలో చేర్చుకోవాలని జగన్ పడుతున్న తాపత్రయం చూస్తున్నవారికి నవ్వుగాక మరేం వస్తుంది చెప్పండి...!