Advertisementt

మొత్తానికి మహేష్‌ ఫిక్సయ్యాడు...!

Thu 28th Apr 2016 02:09 PM
mahesh babu,bramhotsavam,mahesh babu bramhotsavam updates,bramhotsavav,mahesh babu movie audio release date  మొత్తానికి మహేష్‌ ఫిక్సయ్యాడు...!
మొత్తానికి మహేష్‌ ఫిక్సయ్యాడు...!
Advertisement
Ads by CJ

ఇంతకాలం మహేష్‌బాబు నటిస్తున్న 'బ్రహ్మోత్సవం' చిత్రం రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌కాకపోవడంతో చాలామంది ఇతర సినిమాల వారు తమ చిత్రాల డేట్స్‌ను అనౌన్స్‌ చేయలేక కామ్‌గా ఉండిపోయారు. ఎట్టకేలకు ఈ మహేష్‌ చిత్రం విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం ఆడియోను మొదట తిరుపతిలో నిర్వహించాలని భావించారు. కానీ ఈ చిత్రం ఆడియోను మే 6వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మిక్కీ జెమేయర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పివిపి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం తమిళ వెర్షన్‌ ఆడియో ఓ వారం గ్యాప్‌ తర్వాత విడుదల చేయనున్నారు. తెలుగు ఆడియో వేడుకకు నాగార్జున చీఫ్‌ గెస్ట్‌గా వస్తాడని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో మే 20న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నారు. దీంతో మహేష్‌ అభిమానుల్లో ఎంతో సంతోషం కనిపిస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ