Advertisementt

నెలరోజుల్లో ఆ హీరోవి రెండు చిత్రాలు!

Thu 28th Apr 2016 01:37 PM
naga chaithanya,hero naha chaithanya,naga chaithanya movie updates,actor naga chaithanya,naga chaithanya upcoming movies  నెలరోజుల్లో ఆ హీరోవి రెండు చిత్రాలు!
నెలరోజుల్లో ఆ హీరోవి రెండు చిత్రాలు!
Advertisement

నాగచైతన్య వరస చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ ఆయన చిత్రాలు విడుదల విషయంలో, షూటింగ్‌ విషయంలో చాలా ఆలస్యమవుతున్నాయి. కాగా నాగచైతన్య ప్రస్తుతం గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో చేస్తున్న 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం ఇటీవలే క్లైమాక్స్‌ను పూర్తి చేసుకుంది. దీంతో కొంత ప్యాచ్‌వర్క్‌ మినహా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. మరోవంక ఆయన చందుమొండేటి దర్శకత్వంలో 'ప్రేమమ్‌' మలయాళ రీమేక్‌లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం రామోజీఫిలింసిటీలో జరుగుతోంది. మొత్తం ఒక వ్యక్తి జీవితంలో జరిగిన మూడు ప్రేమకథల సమాహారంగా ఈ చిత్రం రూపొందుతోంది. మలయాళంలో కేవలం 4కోట్లతో రూపొందిన ఈ చిత్రం అక్కడ 60కోట్లు కొల్లగొట్టింది. కాగా ఈచిత్రం తదుపరి షెడ్యూల్‌ మే 3 వతేదీ నుండి రెండు వారాల పాటు గోవాలో చిత్రీకరించనున్నారు. ఇందులో నాగచైతన్య సరసన శృతిహాసన్‌, అనుపమ పరమేశ్వరన్‌, మడోనా సెబాస్టియన్‌లు నటిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్నిన జులై నెలలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. మొత్తానికి ఒక నెల గ్యాప్‌లో నాగచైతన్య నటిస్తున్న రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుండటంతో అక్కినేని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement