తెలుగు సినీ చరిత్రలో 'బాహుబలి' చిత్రం ఓ సంచలనం. ఈ చిత్రం తెలుగు సినిమా స్ధాయిని బాగా పెంచింది. మొత్తానికి థియేటర్లలో టిక్కెట్ల ధరలను పెంచడంతో పాటు ఈ చిత్రం ఓపెనింగ్స్ విషయంలో కూడా ఓ సరికొత్త ఒరవడికి తెరతీసింది. ఇప్పుడు ఆ ఫలాలను మన స్టార్‌హీరోలు ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓపెనింగ్స్ విషయంలో ఈమద్య మన స్టార్ హీరోల చిత్రాలు జయాపజయాలకు అతీతంగా ఓపెనింగ్స్‌ను కుమ్మేస్తూ, 'బాహుబలి'కి, దాని దర్శకుడు 'జక్కన్న'కు రుణపడిపోతున్నారు. 'బాహుబలి'కి ముందు తెలుగు చిత్రాల మొదటిరోజు కలెక్షన్లను తీసుకుంటే పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'అత్తారింటికి దారేది' చిత్రం అగ్రస్థానంలో ఉంది. కాగా ఈచిత్రం మొదటి రోజు సాధించిన కలెక్షన్లు కేవలం 10.90కోట్లు మాత్రమే. 'బాహుబలి' మాత్రం తొలిరోజు 22.5 కోట్లు వసూలు చేసి సంచలనం సాధించింది. ఇక మహేష్‌బాబు 'శ్రీమంతుదు' చిత్రం తొలిరోజు 13కోట్లు వసూలు చేసింది. రామ్‌చరణ్
నటించిన డిజాస్టర్ మూవీ 'బ్రూస్‌లీ' 12కోట్లు సాధించింది. ఇక ఇటీవల వచ్చిన పవన్ 'సర్దార్‌గబ్బర్‌సింగ్' డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ మొదటి రోజు బాలీవుడ్ చిత్రాలకు ధీటుగా 21కోట్లు వసూలూ చేసి సినిమా అట్టర్‌ఫ్లాప్ అయినా 50కోట్ల క్లబ్‌లో చేరడం ఆశ్చర్యాన్ని కలిగించకమానదు. ఇక బన్నీ'సరైనోడు' చిత్రం కూడా మొదటి నాలుగు రోజుల్లో 30కోట్ల వరకు వసూలు చేసింది. మొత్తానికి ఓపెనింగ్స్ విషయంలో మనం 'బాహుబలి' ముందు, 'బాహుబలి' తర్వాత అని ఇక నుంచి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది.