గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసీ)కి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో పోర్న్‌స్టార్, బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నిలియోన్ నగ్నచిత్రం కనిపించండంతో అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జిహెచ్‌ఎంసీకి చెందిన చెత్త రవాణా వాహనాల రాకపోకలకు సంబంధించిన పేజీని ఓపెన్ చేస్తే సన్నిలియోన్ నగ్నచిత్రం కనిపించింది. కొందరు ఆకతాయీలు ఈ పనిచేశారని, సైట్‌ను హ్యాక్ చేసి ఈ విధంగా తమను అభాసుపాలు చేశారని జిహెచ్‌ఎంసీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లోనే ఇలా జరగడం ఏమిటని మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ ఒక్క విషయంలోనే జీహెచ్‌ఎంసీ అధికారుల పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందో అర్దం అవుతోందని కొందరు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఈ సంఘటన అందరినీ ఒక్కసారిగా బిత్తరపోయేట్లు చేసింది. ఈ విషయమై మీడియా వారు సైఫాబాద్ పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదనే సమాధానం వచ్చింది. అయితే ఈ నగ్న ఫొటో కనిపించిన వెంటనే మాత్రం జిహెచ్‌ఎంసీ అధికారాలు అప్రమత్తమై తమ టెక్నికల్ టీమ్ ద్వారా నగ్న చిత్రాన్ని వెంటనే తీసివేయడం గుడ్డిలో మెల్లగా చెప్పుకోవచ్చు.