Advertisementt

మాస్‌రాజా లో మార్పు రావాలి!

Wed 27th Apr 2016 06:26 PM
raviteja,rough look,raviteja glamour,raviteja look,kick 2,bengal tiger  మాస్‌రాజా లో మార్పు రావాలి!
మాస్‌రాజా లో మార్పు రావాలి!
Advertisement
Ads by CJ

చాలా ఆలస్యంగా టాలీవుడ్‌లో హీరోగా అవకాశం పొంది తనదైన నటన, మేనరిజమ్స్‌, రఫ్‌ లుక్‌, గడ్డం, ఎనర్జీతో తనకంటూ ఓ ప్రత్యేక స్దానం సంపాదించాడు రవితేజ. ఎవ్వరి అండ దండలు లేకుండానే కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్‌, శ్రీనువైట్ల తదితరులతో హిట్‌ సినిమాలు చేశాడు. ఒకప్పుడు రవితేజ అంటే ఆయన లుక్‌ అదిరిపోయేది. కానీ 'కిక్‌2' నుంచి తన గ్లామర్‌ను, లుక్‌ను కోల్పోయాడు రవితేజ. బరువు తగ్గడంతోపాటు సిక్స్‌ప్యాక్‌ సాధించే క్రమంలో ఆయన మొహంలో కళ తప్పింది. 'కిక్‌2'తోపాటు 'బెంగాల్‌టైగర్‌' చిత్రంలోని రవితేజను చూసి ఆయన అభిమానులు కూడా దిగాలు పడ్డారు. అనవసరంగా సిక్స్‌ప్యాక్‌లు, బరువు తగ్గడం వంటి పనుల వల్ల ఆయన తన పూర్వపు గ్లామర్‌లుక్‌ పోవడంపై అందరూ రవితేజపై సెటైర్లు వేస్తున్నారు. అయినా తనకు నచ్చిన, ప్రేక్షకుల మెప్పును పొందిన ఆయన త్వరలో మరలా పూర్వపు రవితేజగా కనిపించాలని కోరుకుంటున్నారు. మరి అందరూ కోరుతున్న విన్నపం రవితేజ చెవులకు చేరిందో లేదో తెలియడం లేదు. ప్రస్తుతం ఆయన లుక్‌ చూస్తే ఆయన వయసు మరింత పెరిగినట్లుగా కనిపిస్తుండటం గమనార్హం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ