Advertisementt

రెండేళ్ల వరకు బన్నీ ని కదిలించగలరా !

Wed 27th Apr 2016 05:49 PM
allu arjun,allu arjun full swing with movies,allu arjun next 2 year projects,bunny  రెండేళ్ల వరకు బన్నీ ని కదిలించగలరా !
రెండేళ్ల వరకు బన్నీ ని కదిలించగలరా !
Advertisement
Ads by CJ

తనతోటి హీరోల కంటే సినిమాల విషయంలో స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ వేగంగా దూసుకెళుతున్నాడు. ఇటీవలే ఆయన నటించిన 'సరైనోడు' చిత్రం విడుదలైంది. దీని తర్వాత ఆయన జూన్‌ నుండి తమిళ దర్శకుడు లింగుసామి డైరెక్షన్‌లో పక్కా మాస్‌ చిత్రం చేయనున్నాడు. ఇక నవంబర్‌ నుండి 'మనం, 24' చిత్రాల దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం మొదలుపెట్టనున్నాడు. కాగా ఈ రెండు చిత్రాలు ద్విభాషా చిత్రాలుగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్నాయి. లింగుసామి చిత్రాన్ని తమిళంలో జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తుండగా, తెలుగులో అల్లు అరవింద్‌ నిర్మించనున్నాడు. కాగా బన్నీ, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కూడా ఓ చిత్రం చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. మరోవైపు 'సరైనోడు' చిత్రంలో బన్నీని  బోయపాటి శ్రీను చూపించిన విధానం నచ్చడంతో త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ మరో చిత్రం కూడా చేయనున్నాడట. ఈ విషయాన్ని బన్నీతో పాటు బోయపాటి కూడా కన్‌ఫర్మ్‌ చేశారు. సో..ఇలా చూస్తే ఇంకో రెండేళ్ళ వరకు బన్నీ డైరీ ఫుల్ అనే చెప్పవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ