Advertisementt

నిర్మాత చావుకి కారణం సినిమా కాదట!

Wed 27th Apr 2016 05:05 PM
ajay,shanil mohammed,avarude ravakul,preview show  నిర్మాత చావుకి కారణం సినిమా కాదట!
నిర్మాత చావుకి కారణం సినిమా కాదట!
Advertisement
Ads by CJ

'అవరుడే రవుకల్' అనే మలయాళ సినిమా చిత్ర నిర్మాత అజయ్ ఆ సినిమా ప్రివ్యూ చూసిన తరువాత సూసైడ్ చేసుకొని చనిపోయాడనే వార్తలు వినిపించాయి. అయితే తను చనిపోవడానికి కారణం అది కాదని చిత్ర దర్శకుడు షానిల్ మొహమ్మద్ స్పష్టం చేశారు. అజయ్ సెట్ లో అందరితో చాలా సరదాగా ఉండేవాడు. ప్రతి ఒక్కరి అవసరాలను తెలుసుకొని వాటిని తీర్చేవాడు. అలాంటి మనిషి సినిమా ప్రివ్యూ చూసి చనిపోయాడని ప్రచురిస్తున్న వార్తల్లో నిజం లేదు. నిజానికి మా సినిమా రెడీ అవ్వడానికి ఇంకా నెల రోజుల సమయం పడుతుంది. సినిమా ఎడిటింగ్, డబ్బింగ్, బీజిఎం వంటి పనులు పూర్తి కాలేదు. అలాంటప్పుడు అజయ్ అసలు ప్రివ్యూ ఎలా చూడగలుగుతాడని ప్రశ్నించారు. సినిమా శాటిలైట్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మంచి రేట్లకే అమ్ముడిపోయాయి. తను ఎలాంటి ఆర్ధిక సమస్యలను ఎదుర్కోలేదు. ఈ సినిమా రిలీజ్ తరువాత మరో సినిమాను కూడా ప్లాన్ చేశాడు. ఈ సమయంలో అజయ్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో.. తెలియడం లేదని వెల్లడించాడు.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ