Advertisementt

అందుకే రజినీకాంత్ సూపర్‌స్టార్‌!

Tue 26th Apr 2016 06:14 PM
rajinikanth,super star,kabali,dubbing,ranjit paa,robo  అందుకే రజినీకాంత్ సూపర్‌స్టార్‌!
అందుకే రజినీకాంత్ సూపర్‌స్టార్‌!
Advertisement
Ads by CJ

కుర్ర హీరోలు కూడా ఒక చిత్రం పూర్తయిన తర్వాత మరో చిత్రాన్ని ప్రారంభిస్తుంటే సౌతిండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మాత్రం ఒకేసారి 'కబాలి', 'రోబో2.0' చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ వయసులో కూడా ఆయన ఓ వైపు 'కబాలి' చిత్రానికి డబ్బింగ్‌ చెబుతూ, మరోవైపు 'రోబో2.0' షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ వయస్సులో కూడా రజనీకాంత్‌ కేవలం ఐదు రోజుల్లో 'కబాలి' చిత్రం డబ్బింగ్‌ను పూర్తి చేశాడు. ఇక ఈ చిత్రాన్ని జూన్‌ మొదటి వారంలో విడుదల చేయడానికి రంగం సిద్దం చేస్తున్నారు. రియలిస్టిక్‌ చిత్రాలను తెరకెక్కిండంలో అతి తక్కువ కాలంలోనే తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రంజిత్‌ పా 'కబాలి' చిత్రానికి డైరెక్టర్‌గా వ్యవహిరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రజనీకాంత్‌ వయసు మళ్లిన గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తుండగా, ఆయనకు జోడీగా రాధికాఆప్టే నటిస్తోంది. ఈ చిత్రం ఆడియోను కూడా అతి త్వరలో తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నారు. ఈ చిత్రం రజనీకి మరో 'బాషా' చిత్రం అవుతుందని యూనిట్‌ సభ్యులతోపాటు అభిమానులు కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రం పోస్టర్స్‌ ఇప్పటికే ఈ చిత్రంపై ఉన్న అంచనాలను భారీగా పెంచేశాయి. కలైపులిథాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ