లౌక్యం, డిక్టేటర్ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ హీరోగా సినిమా రూపొందుతుంది. ఈ సందర్భంగా...
డైరెక్టర్ శ్రీవాస్ మాట్లాడుతూ 'గోపీచంద్ హీరోగా, నా దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాను. మా కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్యం లాంటి బ్లాక్ బస్టర్ట్స్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గకుండా మా కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలకు మించి ఉండేలా భారీగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాం. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాం' అన్నారు.