Advertisementt

దిల్‌రాజుపై కోపంగా ఉన్న నిర్మాత!

Mon 25th Apr 2016 11:00 PM
dil raju,policeodu,kabali,telugu theri movie,promotion  దిల్‌రాజుపై కోపంగా ఉన్న నిర్మాత!
దిల్‌రాజుపై కోపంగా ఉన్న నిర్మాత!
Advertisement
Ads by CJ

తెలుగులో నిర్మాతగా, పంపిణీదారునిగా దిల్‌రాజుకు ఎంతో పేరుంది. ఆయన తమ చిత్రాలను కొంటే మిగిలిన ఏరియాల్లో డిస్ట్రిట్యూటర్లు ఆ చిత్రాన్ని హాట్‌కేకుల్లా కొంటారు. ఈ విషయంలో దిల్‌రాజు స్టామినా, ఆయన డెసిషన్‌ తీరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... తమిళం, కన్నడ నిర్మాతలకు కూడా బాగా తెలుసు. అందుకే ఎంతో కాలంగా తెలుగులో సరైన మార్కెట్‌లేని తమిళ స్టార్‌ విజయ్‌ చిత్రం 'తేరీ' తెలుగు వెర్షన్‌ హక్కులను ఆ చిత్ర నిర్మాత కలైపులి. థాను.. దిల్‌రాజు చేతుల్లో పెట్డాడు. దిల్‌రాజు కూడా కలైపులి థాను నిర్మిస్తున్న రజనీకాంత్‌ చిత్రం 'కబాలి' తెలుగు రైట్స్‌ తనకిస్తారనే నమ్మకంతో 'పోలీసోడు'ను విడుదల చేయడానికి ముందుకు వచ్చాడు. కానీ ఈ చిత్రం తెలుగులో ఎవ్వరినీ ఆకట్టుకోలేకపోయింది. వాస్తవానికి తాను నిర్మించే లేదా తాను డిస్ట్రిబ్యూట్‌ చేసే చిత్రాల ప్రమోషన్‌ నుండి అన్ని పర్‌ఫెక్ట్‌గా హ్యాండిల్‌ చేసే దిల్‌రాజు 'పోలీసోడు' విషయంలో మాత్రం చేతులెత్తేశాడు. ఈ చిత్రానికి ఆయన తన సినిమాల స్థాయిలో పబ్లిసిటీతో పాటు ఇతర విషయాలపై నిర్లక్ష్యం వహించాడని, దీంతో ఈ చిత్రం అసలు నిర్మాత కలైపులి థాను దిల్‌రాజుపై కోపంగా ఉన్నాడని సమాచారం. తమిళంలో మొదటి వారంలోనే 100కోట్ల గ్రాస్‌ కలెక్షన్లను వసూలు చేసిన ఈ చిత్రం తెలుగులో పోస్టర్‌ ఖర్చులను కూడా రాబట్టలేకపోయింది. దీనికి దిల్‌రాజు ఉదాసీనతే కారణమని భావించిన కలైపులి థాను 'కబాలి' రైట్స్‌ విషయంలో ఎక్కువ మొత్తం చెప్పడమో లేదో దిల్‌రాజుకు కాకుండా వేరే వారికి రైట్స్‌ ఇవ్వడమో చేయాలని భావిస్తున్నాడట. మొత్తానికి నమ్మి ఇచ్చిన చిత్రాన్ని దిల్‌రాజు కిల్‌ చేశాడనే ప్రచారం కోలీవుడ్‌లో కూడా హల్‌చల్‌ చేస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ