Advertisementt

టైటిల్స్‌తోనే ఆకట్టుకుంటున్న మెగాహీరో!

Mon 25th Apr 2016 10:28 PM
saidharam tej,aakatayi,saidharam tej new movie title,gopichand malineni  టైటిల్స్‌తోనే ఆకట్టుకుంటున్న మెగాహీరో!
టైటిల్స్‌తోనే ఆకట్టుకుంటున్న మెగాహీరో!
Advertisement
Ads by CJ

మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ రోజు రోజుకీ రాటుదేలుతున్నాడు. కథ, కథనాల్లో కాదు.. అన్ని విషయాల్లోనే అతను చక్కని నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మరి ఆయన వెనుక అలాంటి మంచి సలహాలు ఇచ్చే మాస్టర్‌మైండ్‌ ఎవరిదా? అనే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. మెగాఫ్యామిలీనే సాయికి సలహాలు, సూచనలు ఇస్తుందని భావించాలంటే మరి వరుణ్‌తేజ్‌ విషయంలో ఎందుకు మెగాఫ్యామిలీ నిర్లక్ష్యం వహిస్తుంది అనే ప్రశ్న ఉదయించకమానదు. కొందరు మాత్రం సాయి నిర్ణయాల వెనుక దిల్‌రాజు మాస్టర్‌మైండ్‌ ఉందని అంటున్నారు. 'రేయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' వంటి టైటిల్స్‌ ఆయా చిత్రాలకు మంచి ఆసక్తినే రేకెత్తించాయి. తాజాగా ఆయన చేస్తున్న 'సుప్రీమ్‌, తిక్క' టైటిల్స్‌ కూడా మంచి స్పందన వస్తోంది. ఇక తాజాగా ఆయన గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కూడా 'ఆకతాయి' అనే మాస్‌ టైటిల్‌ను పెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ మెగా మేనల్లుడు. మరి ఆయన రాబోయే చిత్రాలు టైటిల్స్‌ పరంగానే కాకుండా అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తాయా? లేదా? అన్నది వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ