బాలకృష్ణ, వెంకటేష్, జూనియర్ ఎన్టీయార్, రవితేజ, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలని డైరెక్ట్ చేసిన తరువాత బోయపాటి శ్రీనుకి తప్పకుండా బడా హీరోల నుండి ఎనలేని కాల్స్ రావడం సహజమే. బాలయ్యకు ఓ చిత్రం, చిరంజీవి గారికి ఇంకో చిత్రం, అలాగే మోక్షజ్ఞ్య డెబ్యూ సినిమా చేసే సూచనలు భవిష్యత్తులో ఉన్నప్పటికీ బోయపాటి మాత్రం తన తదుపరి అవకాశాన్ని బెల్లంకొండ శ్రీనివాస్ కోసం అట్టిపెట్టాడు. నిజానికి సాయి శ్రీనివాస్ మొదటి చిత్రం అల్లుడు శీను తరువాతే బోయపాటి సినిమా మొదలవాల్సింది. కొన్ని అనివార్య కారణాల చేత అనౌన్స్ చేయబడ్డ ఆ ప్రాజెక్ట్ అటక ఎక్కేసింది. ఇప్పుడ సరైనోడు తరువాత వేరే స్టార్ హీరోల నుండి ఎన్నో ఆఫర్స్ ఉన్నా కూడా బోయపాటి తన మాట నిలుపుకునే పనిలో ఉన్నాడు. ఇంతవరకు ఓ ఇమేజి ఉన్న హీరోలను మాత్రమే డైరెక్ట్ చేసిన బోయపాటి ఇప్పుడు ఫ్లాపుల్లో కూరుకుపోయిన సాయి శ్రీనివాస్ కెరీరును మలుపు తిప్పే కథ తయారు చేస్తున్నాడని తెలుస్తోంది. మనం విజయపథంలో ఉన్నాం కదాని ఎదుటి వారికి ఇచ్చిన మాటను తప్పకూడదు. అందుకే బెల్లంకొండ శ్రీనివాస్ కోసం కొత్త కథను తయారు చేస్తున్నాను. తొందరలోనే మిగతా విషయాలు తెలియజేస్తాను అంటున్నారు బర్త్ డే హీరో బోయపాటి.