ఇంతకు ముందు తెలుగు సినిమాకి ఇక్కడ తప్ప ఇంకెక్కడా పెద్దగా మార్కెట్ ఉండేది కాదు. కానీ, ఈ మధ్య కాలంలో పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఓవర్సీస్ లో తెలుగు సినిమా స్థాయి, ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. అగ్ర నటుల చిత్రాలకి 1 మిలియన్ అంటే అదేదో చాలా చిన్న విషయం అయిపొయింది. మనవాళ్ళు పక్క రాష్ట్రాల మీద కూడా బానే కన్నేశారు. ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం జనత గ్యారేజ్ ని తెలుగు, మరియు మలయాళంలో భారీ బిజినెస్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. అందుకు గాను, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ని ఒక ముఖ్యమైన పాత్రకు తీస్కున్నారు. మహేష్ బాబు తన తర్వాతి చిత్రంగా మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు. తెలుగు, తమిళ్ లో ఒకేసారి నిర్మాణం కానున్న ఈ చిత్రం ద్వారా, మహేష్ బాబు తమిళ్ మార్కెట్ పై కన్నేసాడనే విషయం ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. సరైనోడు హిట్ తో మంచి ఊపు మీదున్న అల్లు అర్జున్, తమిళ దర్శకుడు లింగుసామితో ఒక ద్విబాశా చిత్రం చేయనున్నాడని సమాచారం. ఇప్పటికీ, తెలుగు, కన్నడ, మలయాళం లో మంచి మార్కెట్ ఉన్న బన్నీ, ఈ కొత్త చిత్రం ద్వారా తమిళ్ మార్కెట్ లో కూడా పాగా వేయనున్నాడన్నమాట!