నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం షూటింగ్ శుక్రవారం అంగరంగవైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. 'గౌతమి పుత్ర
శాతకర్ణి' జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ హిస్టారికల్ చిత్రం షూటింగ్‌కు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ చిత్రాన్ని 'బాహుబలి'లా ఓ విజువల్ వండర్‌గా రూపొందిస్తానని దర్శకుడు క్రిష్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రాన్ని వీలున్నంతలో వేగంగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని నిలపాలని బాలయ్యతో పాటు క్రిష్ భావిస్తున్నాడు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 'కత్తి' రీమేక్‌కు సంబంధించి స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు పూర్తయ్యాయని, చిరు ఓకే చెప్పిన అనంతరం ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రం ఓ రీమేక్ సబ్జెక్ట్ కావడంతో ఈ చిత్రం షూటింగ్‌కు ఎక్కువ సమయం పట్టే అవకాశం లేదని వినాయక్, చిరులు భావిస్తున్నారట. సో.. ఈ చిత్రాన్ని కూడా వచ్చే సంక్రాంతి కానుకగానే విడుదల చేయాలని భావిస్తున్నారు. అదే జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో బాలయ్య, చిరుల మద్య పెద్ద బాక్సాఫీస్ ఫైట్ జరగడం ఖాయం అంటున్నారు. వాస్తవానికి బాలయ్యకు సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చిందనే సెంటిమెంట్ అందరిలో ఉంది. ఇక 'గౌతమి పుత్ర శాతకర్ణి', 'కత్తి' రీమేక్‌లు ఒకేసారి బరిలోకి దిగితే అభిమానులకు కూడా పండుగే అని చెప్పాలి. 2001లో బాలయ్య, చిరుల 'నరసింహనాయుడు, మృగరాజు' చిత్రాలు విడుదలయ్యాయి. ఈ పోరులో బాలయ్యే పైచేయి సాధించాడు. మరి అప్పటి నుండి మరలా వీరిద్దరు బాక్సాఫీస్ వద్ద పోటీపడలేదు. మరి వచ్చే ఏడాది సంక్రాంతికి అదే జరిగితే టాలీవుడ్ బాక్సాఫీసులు బద్దలుకావడం ఖాయమని అటు నందమూరి అభిమానులు, ఇటు మెగాభిమానులు భావిస్తున్నారు.